కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవంలో జగన్,ఫడ్నవీస్..!! || Oneindia Telugu

2019-06-21 243

Touted as the world's largest multi-stage irrigation project, Kaleshwaram on river Godavari is all set to be inaugurated by Governor ESL Narasimhan in the presence of AP and Maharashtra Chief Ministers YS Jagan Mohan Reddy and Devendra Fadnavis, respectively on Friday. Telangana Chief Minister K Chandrashekar will perform homam and special pujas in the morning at the project site in Jayashankar Bhupalapally district on the border of Maharashtra and Chhattisgarh.
#telangana
#kaleshwaramproject
#inauguration
#kcr
#ysjaganmohanreddy
#devendrafadnavis
#Governoreslnarasimhan

తెలంగాణను సస్యశ్యామలం చేయాలన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కల నేటితో నెరవేరబోతోంది. కోటి ఎకరాలకు నీళ్లిచ్చి తెలంగాణలో రైతుల కన్నీళ్లు తుడవటానికి చేసిన భాగీరధ యత్నం నేను ఫలించబోతుంది. తెలంగాణ ప్రజలు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టును మరికాసేపట్లో కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఉదయం 10:30 గంటలకు మేడిగడ్డ వద్ద కాళేశ్వరం పథకాన్ని ఆయన ప్రారంభిస్తారు. గవర్నర్ నరసింహన్ చేతుల మీదుగా కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభం అవుతుంది. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు . సీఎం కేసీఆర్ మేడిగడ్డ బ్యారేజీకి చేరుకుని హోమంలో పాల్గొంటారు. కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించిన అనంతరం 10:50కి కన్నెపల్లి చేరుకొంటారు. 11.40 కి పంపుహౌస్‌ను ప్రారంభిస్తారు.